నెల్లికుదురు, నవంబర్ 5 : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరిగిన రాష్ట్రస్థాయి 68వ ఎస్జీఎఫ్ క్రీడల్లో విలువిద్య, ఫెన్సింగ్ పోటీలు మంగళవారం ముగిశాయి. ఆర్చరీలో 14 ఏండ్ల విభాగంలో 24 మంది బాలబాలికలు, 17 సంవత్సరాల విభాగంలో 24 మంది విజేతలుగా నిలిచారు. వీరు గుజరాత్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఫెన్సింగ్‌లో 14 ఏండ్ల విభాగంలో 24 మంది బాలబాలికలు, 17 ఏండ్ల విభాగంలో 24 మంది, 19 ఏండ్ల విభాగంలో 24 మంది, గ్రూప్ ఈవెంట్లో నలుగురు మొత్తం76 మంది విజేతలుగా నిలిచారు. వీరు పాట్నాలో జరిగే జాతీయ స్థాయి పోటీ పడుతారు. ఆర్చరీ, ఫెన్సింగ్‌లో క్రీడాకారులు ప్రదర్శన ఆధారంగా స్వర్ణ,రజత, కాంస్య పతకాలను అందజేశారు. ఆర్చరీ, ఫెన్సింగ్‌లో కలిసి 600 మంది క్రీడాకారులు పాల్గొనగా 124 మంది జాతీయస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ రాష్ట్ర పరిశీలకులు రవి, ఎస్సై రమేశ్ బాబు, మండల విద్యాశాఖ అధికారి రాందాస్, పీడీలు ఐలయ్య, సునీత, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, టెక్నికల్ పర్సన్లు హరికృష్ణ, శ్రీనివాస్, పుల్లయ్య పాల్గొన్నారు.