
చిక్కడపల్లి, నవంబర్ 20: మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం 20వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మత్స్యకార సాంస్కృతిక సంబురాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ బండా ప్రకాశ్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో మత్స్యకారులకు ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ మిషన్ కాకతీయ ద్వారా సీఎం కేసీఆర్ 46 వేల చెరువులకు జలకళ తెచ్చారన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర జాతీయ కార్యదర్శి లెల్లల బాలకృష్ణ, నాయకులు గోరెంకల నర్సింహ, శ్రీరాములు, కొప్పు పద్మ, లలిత, శంకర్, విజయ్‌కుమార్, నాగమణి, ముఠా దశరథ్, అమరావతి, సత్యవతి, జగదీశ్, కనకతార వెంకన్న, మనోజ్సింగ్ పాల్గొన్నారు.