కోలీవుడ్ (kollywood) స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తోన్నలేటెస్ట్ ప్రాజెక్టు వారసుడు (Varasudu)..తమిళంలో వారిసు టైటిల్‌తో తెరకెక్కుతుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా విజయ్ (Vijay 66th) 66వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
తెలుగు, తమిళ ప్రేక్షకులకు హిట్ సినిమాలందించిన టాప్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ ఈ చిత్రంలో విలన్‌గా కనిపించబోతున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే సిల్వర్ స్క్రీన్‌పై విజయ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ ప్రేక్షకులకు థ్రిల్ అందించడం ఖాయమని చెప్పొచ్చు. మరి దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లను మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా..వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలోమన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.