ఉప్పునుంతల, అక్టోబర్ 31 : డిండి వాగు అలుగు వద్ద హైదరాబాద్-శ్రీశైలం హైవే మరమ్మతులు వేగంగా కొనసాగుతున్నాయని, శనివారం నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ హైదరాబాద్ రీజినల్ ఆఫీసర్, సీఈ కృష్ణప్రసాద్ తెలిపారు. మొంథా తుఫాన్ తీవ్రతతో నీటి ఉధృతి కారణంగా నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ స్టేజీ సమీపంలో హైవేపై రెండో వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే.
శుక్రవారం ఎస్ఈ ధర్మారెడ్డితో కలిసి వాగుపై కూలిన వంతెనను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజులు కురిసిన భారీ వర్షాల కారణంగా హైవే దెబ్బతిన్నదని, అధికారులు, కాంట్రాక్టర్ సమన్వయంతో పునరుద్ధరణ పనులు సాగుతున్నాయని తెలిపారు.