మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 25 : కేసీఆర్ హయాంలో గ్రామీణ, పట్టణ పేదలకు రూ.5 భోజనాన్ని వడ్డించామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా రూ.5 భోజన కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించగా.. అక్కడ చిగిపోయిన టెంట్ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా చినిగిన టెంట్లోనే భోజనం పెట్టడం సరికాదన్నారు.
పేదలంటే ప్రభుత్వానికి అంత చులకనగా కనిపిస్తున్నారా అంటూ ఆ గ్రహం వ్యక్తం చేశారు. ప్రజల వద్ద డబ్బులు లేకున్నా భోజనం పెట్టాం.. ఇక్కడే భో జనం సిద్ధం చేసేందుకు పెద్ద భోజనశాలను కోడూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. పేద ప్రజలు గౌరవంగా తినేందుకు షెడ్ ఏర్పాటు చేశామని, అవసరం అయితే టూరి జం కాంప్లెక్స్ వినియోగించుకున్నారని అన్నా రు.
దవాఖాన నిర్మాణం కారణంగా వాటిని తొలగించి తాత్కాలిక ఏర్పాట్లు చేశామని ని ర్మాణం పూర్తి అయితే పూర్తి స్థాయిలో వసతు లు కల్పించాలనుకున్నామని తెలిపారు. దాని కోసం అప్పుడు తాత్కాలికం గా ఏర్పాట్లు చేశాం.. అప్పుడు చేసిన ఏ ర్పాట్లు తప్పా మళ్లీ ఏ వసతులు చేయలేదు. రోడ్లపై పేదలు భోజనం చేసినా వారి కండ్లకు కనిపించలేదని విమర్శించారు. కలెక్టర్, ము న్సిపల్ కమిషనర్ ఇక్కడే తిరుగుతున్నా చిరిగిన టెంటు, పేదల కష్టాలు కనిపించలేదా..? ఫుట్‌పాత్ మీద భోజనం వడ్డించి పేదల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
అన్ని కులవృత్తుల గురించి ప్రస్తుత తరాలకు తెలిసేలా ఫౌంటేన్, బొమ్మలు ఏర్పాటు చేస్తే కనీసం దాన్ని పట్టించుకోకపోవడంతో అవి కళావిహీనంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులవృత్తుల మీద ఇంత చిన్న చూపా మీకు అని ప్రశ్నించారు. టెంట్‌వేసి భోజనం పెట్టకుంటే మీ కార్యాలయాలు ము ట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. నిధుల సమస్య రాకూడదని ముడా ఏర్పాటు చేశాం దానికి నిధులు ఉన్నాయి.. వాటిని వినియోగించి శాశ్వత వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
పేదలు గౌరవంగా భోజనం తినేందుకు వసతులు కల్పించకుంటే.. నేనే స్వయం గా అవసరమైన వసతులు కల్పిస్తానని తెలిపారు. ఇక్కడ పనులు శ్రీనివాస్‌గౌడ్ చేసిండు ఆయన ఆనవాళ్లు కనిపించవద్దని తీసివేస్తారా.. అలా అనుకుంటే వేయి పడకల దవాఖానని కూల్చివేస్తారా.. విస్తరించిన రోడ్డును చిన్నగా మారుస్తారా.. ఇతర అభివృద్ధి పనులు కూలగొడుతారా.. ఇలాంటి ఆలోచనలు మా నుకొని పేదలకు మేలు చేసే పనులు.. నియోజకవర్గాన్ని పూర్తిస్తాయిలో అభివృద్ధ్ది చేసేందు కు కృషి చేయాలని, దయచేసి రాజకీయాలు చేయవద్దని ఆయన హితవుపలికారు.