కంది, మార్చి 25: క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయి ర్యాంకింగ్-2026లో ఇంజినీరింగ్, టెక్నాలజీ వి భాగంలో ఐఐటీ హైదరాబాద్ 395వ స్థానాన్ని సాధించింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ బై సబ్జెక్ట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా అనుసరించబడే ప్రమాణాల్లో ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా 6 వేలకు పైగా యూనివర్సిటీలను విశ్లేషించి 2వేల విశ్వవిద్యాలయాలను 5 విభాగాలుగా.. ఐదు ప్రధాన సబ్జెక్ట్ రంగాల్లో ర్యాంకింగ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. యువ ఐఐటీగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, తదితర రంగాల్లో పరిశోధనలతో ముందు కు సాగుతామని తెలిపారు. మానవాళికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయడమే లక్ష్యంగా ఐఐటీహెచ్ పనిచేస్తుందని వెల్లడించారు.