Sri Rama Navami | శామీర్పేట, ఏప్రిల్ 5 : తూంకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయంజాల్ శ్రీ సీతారామ స్వామి దేవస్థానంలో బ్రహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. శనివారం ప్రధానార్చకులు కందాళ సీతారామచార్యులు, వేదిపండితుల మంత్రోచ్ఛరణల మధ్య హోమం, ధ్వజాభివాసము, ప్రాణ ప్రతిష్ట, ధ్వజారోహణము, బలిహరణము కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ పెండం లక్ష్మీనారాయణ (నాని) మాట్లాడుతూ.. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు 2 వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇవాళ రాత్రి భేరి పూజ, దేవతాహ్వానము, అశ్వసేవ (ఎదురు కోళ్ళు) కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆదివారం తిరుకళ్యాణ మహోత్సవం మధ్యాహ్నం 12:00 గంటలకు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కల్యాణాన్ని వీక్షించి, స్వామి వారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ