వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటిస్తున్న వింటేజ్ విలేజ్ డ్రామా ‘శ్రీచిదంబరం’. వినయ్త్న్రం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానున్నది. గురువారం ‘వెళ్లేదారిలో..’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు చంద్రశేఖర్ సాహిత్యం అందించగా, చందు రవి స్వరపరిచారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ పాటను ఆలపించడం విశేషం. నిర్మాతలు మాట్లాడుతూ ‘తన గానంతో ఈ పాటకు ప్రాణం పోశారు కీరవాణి.
ఇదొక అందమైన ప్రేమకథ. సహజత్వం ఉట్టిపడేలా కథ, కథనాలు ఉంటాయి. హీరోను అసలు పేరుతో కాకుండా చిదంబరం అని ఊరిజనాలు ఎందుకు పిలుస్తున్నారు? హీరో కళ్లద్దాలు ఎప్పుడూ ఎందుకు పెట్టుకుని ఉంటాడు? ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానమే ఈ సినిమా కథ’ అని తెలిపారు.