ఈ ఏడాది ‘ఫౌజీ’తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు ప్రభాస్. ఇక వచ్చే ఏడాది స్పిరిట్, కల్కి 2 ఉండే అవకాశం ఉంది. ‘సలార్-శౌర్యాంగ పర్వం’ కూడా రేసులో ఉంది. ఇంత భారీ లిస్ట్ ఈ తరం హీరోల్లో ఎవరికీ లేదని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. తాజా సమాచారం ప్రకారం ఈ లిస్ట్‌లో మరో సినిమా కూడా చేరే అవకాశం గట్టిగా కనిపిస్తున్నది. సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నారట.
ఈ సినిమాకు సంబంధించిన కథాచర్చలు కూడా ఇప్పటికే మొదలయ్యాయని తెలిసింది. ప్రస్తుతం రామ్‌చరణ్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ చేసే సినిమా ప్రభాస్‌దే అవుతుందని తెలింది. అందుకే ఓ వైపు ఈ సినిమా కథను సిద్ధం చేసే పనిలో సుకుమార్ టీమ్ నిమగ్నమైందని వినికిడి. ఒకవేళ ఇదే నిజమైతే 2028 ద్వితీయార్ధంలో ఈ సినిమా మొదలవ్వొచ్చు. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తున్నది.