వైవిధ్యమైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన శ్రీవిష్ణు నటిస్తున్న నూతన చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇంతకుముందు అల్లరి నరేష్‌తో ‘మడతకాజా’ చిత్రాన్ని నిర్మించిన వేదరాజ్ టింబర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఓ ఆసక్తికరమైన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు పాత్ర ఎంతో విభిన్నంగా వుంటుంది. టింబు ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.4గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’ అన్నారు.