హనుమకొండ, నవంబర్ 2: నీట్ ఫలితాల్లో తమ కళాశాలల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. సద్లియా నాజ్ జాతీయస్థాయిలో 651 మార్కులు, ఎం స్వజితాచౌదరి 625 మార్కులు, ఆర్ రామసాయి రోహన్ 620 మార్కులు, ఎం అభిష్యం 588 మార్కులు, ఎల్ ఠాగూర్ 583 మార్కులు, ఎస్ చరితశ్రీ 583 మార్కులు సాధించినట్టు తెలిపారు. రిజర్వ్డ్ క్యాటగిరీలో జే హర్షితా సింధు 24 ర్యాంకు, బీ శ్రద్ధాలాల్ 134వ ర్యాంకు, కే మంజుల 418వ ర్యాంకు, ఎం అరుణ్‌రాజ్ 501 ర్యాంకు పొందినట్టు పేర్కొన్నారు. వీరితోపాటు 250 మందికిపైగా విద్యార్థులు మెడిసిన్‌లో సీట్లు సాధించే ర్యాంకులు సాధించినట్టు వివరించారు.