కారేపల్లి, జనవరి 21 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కొమ్ముగూడెం-1 అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు బుధవారం కుర్చీ, స్పూన్, రన్నింగ్ తదితర పోటీలను ఐసిడిఎస్ సూపర్వైజర్ టి.గీతాబాయి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు గణతంత్ర దినోత్సవం నాడు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల కోసం వండిన భోజనాన్ని సర్పంచ్‌తో పాటు సూపర్వైజర్ రుచి చూసి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కల్తీ భద్రయ్య, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.