రైళ్ల వేగం పెంచేందుకు నిరంతరం కృషి : రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
రైళ్ల వేగం పెంచేందుకు నిరంతరం కృషి | భారతీయ రైల్వేలో రైళ్ల వేగవంతం చేసేందుకు నిరంతరం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వేగవంతమైన సామర్థ్యాన్ని, సంబంధిత విభాగం గరిష్టంగా అనుమతించదగిన వేగాన్ని దృష్టిలో ఉంచుకుని రైళ్లు చార్టు ట్రాక్ లభ్యత, అప్ గ్రేడేషన్, సెక్షన్ రెట్టింపు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. రైళ్లను వేగవంతం చేసే ప్రయత్నంలో

న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలో రైళ్ల వేగవంతం చేసేందుకు నిరంతరం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వేగవంతమైన సామర్థ్యాన్ని, సంబంధిత విభాగం గరిష్టంగా అనుమతించదగిన వేగాన్ని దృష్టిలో ఉంచుకుని రైళ్లు చార్టు ట్రాక్ లభ్యత, అప్ గ్రేడేషన్, సెక్షన్ రెట్టింపు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. రైళ్లను వేగవంతం చేసే ప్రయత్నంలో 2018-19, 2019-20 సమయంలో భారతీయ రైల్వే 140, 70 రైళ్లను వేగవంతం చేసిందని తెలిపారు. కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు గతేడాది మార్చి నుంచి ప్యాసింజర్లను నిలిపివేసిందని, ప్రస్తుతం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్య సలహాదారుల ఆందోళనలు, సలహాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను మాత్రమే నడిపిస్తున్నట్లు తెలిపారు.
అయితే, 2020-21 సంవత్సరంలో 488 సర్వీసులను వేగవంతం చేయాలని నిర్ణయించారని చెప్పారు. ఇండియన్ రైల్వే పర్మనెంట్ వే మాన్యువల్ (ఐఆర్పీడబ్ల్యూఎం)లో పేర్కొన్న ప్రమాణాల ఆధారంగా ట్రాక్ రెన్యువల్ పెండింగ్‌లో ఉన్నాయని, రెగ్యులర్ ట్రాక్ రెన్యువల్ పనుల ద్వారా ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడేషన్ చేయనున్నట్లు తెలిపారు. అన్ని సెక్షన్లలో వేగాన్ని గంటకు 130 కిలోమీటర్ల వరకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. 2020-21 మధ్య 4,363 కిలోమీటర్ల (పూర్తి ట్రాక్ పునరుద్ధరణ యూనిట్లలో) ట్రాక్ పునరుద్ధరణ జరిగిందని, ప్రస్తుత 2021-22 సంవత్సరంలో 751 కిలోమీటర్ల (పూర్తి ట్రాక్ పునరుద్ధరణ యూనిట్లలో) ట్రాక్ పునరుద్ధరణ చేపట్టినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మహింద్రా గ్రూప్ చైర్మన్‌గా ఆనంద్ గుడ్‌బై..?
No Rail Fare Concessions | రైలు టిక్కెట్లలో రాయితీ ఊసే లేదు..
Encounter : బుద్గాంలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
Covid-19 Vaccines : ‘ప్రైవేటు’కు 3.56కోట్ల కొవిడ్ టీకాలు : కేంద్రం
Srisailam Dam : శ్రీశైలానికి భారీగా తగ్గిన వరద
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

