తిమ్మాజిపేట : భారత్, పాకిస్తాన్ సరిహద్దులో తలెత్తిన ఉద్రిక్త వాతావరణంలో భారత సేనలు ( Indian Army) విజయం సాధించాలని, సరిహద్దుల ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుతూ శనివారం నాగర్కర్నూల్ తిమ్మాజిపేట మండలం అప్పాజీపల్లి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ( Special prayers) నిర్వహించారు.
వారంతపు పూజలు అనంతరం, స్వామి వారి సన్నిధిలో జాతీయ జెండా ఉంచి వేద పండితులు కృష్ణమూర్తి, గంగాధర శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఇది ధర్మ యుద్ధమని, ధర్మం భారత వైపే ఉందని వారు పేర్కొన్నారు. భారత్ సైనికులు, ప్రజలు సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు రామచంద్రారెడ్డి, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి, వివేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.