KTR | రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ ఎస్.ఐ.ఆర్ (SIR) కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తరపున బీఎల్ఏలను సమన్వయం చేయడం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (SIR) ని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎఎస్.ఐ.ఆర్ కార్యక్రమంలో బీఎల్ఏల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయడం, వారికి వచ్చే సందేహాలను సమస్యలను కేంద్ర పార్టీ కార్యాలయం మధ్య సమన్వయం కల్పించడం, ఆయా అంశాలను స్థానిక ఇన్చార్జిలకు తెలియజేసి సాఫీగా పార్టీ తరఫున ఈ కార్యక్రమం కొనసాగించేలా చూడడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుందని ఆయన తెలిపారు.
దీంతో పాటు ఎన్నికల సంఘంతో సమన్వయం చేస్తూ పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించ డంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కమిటీలో ఎమ్మెల్సీలు ఎల్. రమణ, డాక్టర్ శ్రవణ్ దాసోజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ సోమా, మాజీ చైర్మన్లు మన్నె, క్రిషాంక్, సతీష్ రెడ్డి. వై, పార్టీ నేతలు ముజీబుద్దీన్, సుమిత్ర ఆనంద్, అభిలాష్ రావు రంగినేని సభ్యులుగా ఉంటారు.