బూర్గంపహాడ్, జూలై 03 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని రాజీవ్‌నగర్‌కు చెందిన షేక్ ఆయేషా పర్వీన్ ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కిందపడి కాలు విరిగింది. కాలికి శ్రస్త్ర చికిత్స కోసం రూ.1.50 లక్షలు అవసరం కావడంతో విషయం తెలిసిన వెల్ఫేర్ సొసైటీ బాధ్యులు కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. శుక్రవారం బాలిక వైద్య ఖర్చుల కోసం రూ.10 వేలు ఆర్ధికసాయం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ బాధ్యులు మాట్లాడుతూ.. కూలీ పనులపై ఆధారపడిన నిరుపేద కుటుంబాలకు తమ సంస్థ తరఫున ఎప్పుడూ సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేవా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ ముస్తఫా, మహ్మద్ సోహెల్ పాషా, రెహమాన్, యూసఫ్, మహ్మద్ అజీజ్, అబ్దుల్ సలీమ్ పాల్గొన్నారు.