Cristiano Ronaldo : ఫిఫా వరల్డ్‌కప్‌లో అదరగొడుతున్న క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) తన వీడ్కోలుపై వస్తున్న వార్తలను ఖండించాడు. 32వ రౌండ్లో క్రొయేషియా (Croatia)పై గోల్ కొట్టిన రొనాల్డో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు. సోదరి కతియా అవీరో(Katia Aveiro) చెబుతున్నట్టుగా తాను ఇప్పట్లోనే కెరీర్‌ను ముగించడం లేదని కుండబద్ధలు కొట్టేశాడీ పోర్చుగల్ స్టార్ ఆటగాడు. అయితే.. ఏ నిర్ణయమైనా ఫిఫా వరల్డ్‌కప్ (FIFA World Cup 2026) తర్వాతే అని రొనాల్డో చెప్పాడు.
పోర్చుగల్ ఫార్వర్డ్ క్రిస్టియానో రొనాల్డో వీడ్కోలు వార్తలపై స్పందించాడు. ఫిఫా వరల్డ్‌కప్ మధ్యలోనే తన రిటైర్మెంట్పై వినిపిస్తున్న ఊహాగానాలకు అతడు తెరదించాడు. క్రొయేషియాతో మ్యాచ్‌లో సూపర్ గోల్‌తో జట్టును గెలిపించిన ఈ స్టార్ ఆటగాడు.. ‘ఇప్పుడు వీడ్కోలు గురించిన చర్చ ఎందుకు?’ అని మీడియాను ప్రశ్నించాడు.
🚨🇵🇹 Cristiano Ronaldo scores from the penalty spot for Portugal against Croatia.
pic.twitter.com/qvhwZ5JUwp— Sports on Predict (@predictdotsport) July 3, 2026
‘వీడ్కోలు గురించి మాట్లాడేందుకు ఇంకా సమయం ఉంది. ఫిఫా వరల్డ్‌కప్‌లో విజయం లేదా ఓటమి అనంతరం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటా. నా కుటుంబంతో మాట్లడి సరైన నిర్ణయం ప్రకటిస్తా. ఇప్పుడు టోర్నమెంట్ కొనసాగుతున్నందున నేను దాని గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతానికి అంతా సజావుగా సాగుతోంది. నావరకైతే ప్రస్తుతాన్ని ఆస్వాదించడం, పోర్చుగల్ విజయాల్లో భాగమవ్వడం చాలా ప్రధానం’ అని రొనాల్డో పేర్కొన్నాడు.
🚨 BREAKING: Cristiano Ronaldo to retire from international football with Portugal after the World Cup, his sister Katia says.
“Enjoy it while it lasts. It’s ending soon. The info I have, from a reliable source… this is his LAST DANCE”, told SportTV. pic.twitter.com/3WbtZgEHrH
— Fabrizio Romano (@FabrizioRomano) July 2, 2026
ఈమధ్య స్పోర్ట్స్ టీవీతో రొనాల్డో సోదరి కతియా అవీరా మాట్లాడుతూ.. ‘ఈసారి ఫిఫా వరల్డ్‌కప్ రొనాల్డోకు ఆఖరు. ఈ టోర్నీతో అతడు వీడ్కోలు పలకనున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే.. ఈరోజే అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కచ్చితంగా చెప్పలేను. కానీ, త్వరలోనే మీరు వీడ్కోలు వార్త వింటారు. ఇది అతడి ఆఖరి వరల్డ్‌కప్ అని నేను నమ్ముతున్నా’ అని వెల్లడించింది.