నిజామాబాద్ : తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం కేక్ కట్ చేశారు.
అనంతరం స్థానిక సరస్వతి దేవాలయంలో స్పీకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన నాయకులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పీకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు.