 
                                                            నీలగిరి, అక్టోబర్ 31: దేశ సమగ్రత, ఐక్యత కోసం కృషి చేసిన గొప్ప దేశభక్తుడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ అని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పటేల్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా 2కె రన్‌ను ఆయన జండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర పోరాటంలో శీలక పాత్ర పోషించి, 550 కి పైగా సంస్థానాలను భారత దేశంలో విలీనం చేసేందుకు దృఢ సంకల్పంతో ఎలాంటి వత్తిడికి లొంగకుండా కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయి పటేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్సీ కొలను శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్సీ శ్రీనివాసులు, సీఐలు రాజశేఖర్ రెడ్డి, మహా లక్ష్మయ్య, రాఘవరావు, ఎస్ఐలు సైదులు, ప్రజాబాబు, గోపాల్‌రావు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
12వ బెటాలియన్ లో..
జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా అన్నేపర్తిలోని 12వ బెటాలియన్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ కె.వీరయ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఆయన వెంట అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగ్ వెంకన్న, ఆండలు, ఆర్ఎస్ఐబలు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
 
                            