హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సోమవారం పెన్షన్ అదాలత్ నిర్వహించారు. ఇందులో 361 కేసులు పరిష్కరించామని సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.
మరో 93 దరఖాస్తులు స్వీకరించామని పేర్కొన్నారు. అలాగే 70,884 మందికి ఉమీద్ కార్డులు ఇచ్చామని తెలిపారు.