అజాంగఢ్: ఆఖరి విడుత అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూపీలో బీజేపీకి చుక్కెదురైంది. ఆ పార్టీకి చెందిన బలమైన నేత, ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్ జోషి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు. అజాంగఢ్‌లో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ సమక్షంలో ఆయన ఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. తన కుమారుడికి లక్నో కంటోన్మెంట్ నుంచి బీజేపీ సీటు కేటాయించాలని, అవసరమైతే ఎంపీ పదవిని కూడా త్యాగం చేస్తానని రీటా బహుగుణ గత జనవరిలో ఆ పార్టీ హైకమాండ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే మయాంక్‌కు బీజేపీ సీటు ఇవ్వలేదు. దీంతో నాయకత్వంపై రీటా కూడా అసంతృప్తితో ఉన్నారు. 2017 సాధారణ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి రీటా బహుగుణ భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. మయాంక్ ఎస్పీలో చేరడం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు.