శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్ర పోషించిన క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’. విశ్వదేవ్ రాచకొండ కథానాయకుడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. డి.సురేష్‌బాబు నిర్మాత. ఈ నెల 23న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నదని మేకర్స్ చెబుతున్నారు.
ఇందులో ‘సంధ్య’ అనే క్రైమ్ పాడ్‌కాస్టర్‌గా శోభిత ధూళిపాళ్ల నటించారని, 20ఏండ్ల క్రితం జరిగిన వరుస హత్యల వెనుక ఉన్న రహస్యాలను, ఒక సీరియల్ కిల్లర్ ఆచూకీని తన పాడ్‌కాస్ట్ ద్వారా ఆమె ఎలా కనిపెట్టింది? అనేదే ఈ సినిమా కథ అని మేకర్స్ తెలిపారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఈ నేపథ్యంలోనే సాగింది. నిజం కోసం పోరాడే ధైర్యం గురించి చెప్పే కథ ఇదని దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి అన్నారు.