Snakes : హైదరాబాద్ నగరంలోని ఓ పోలీస్స్టేషన్లో నాగుపాము పిల్లలు కలకలం సృష్టించాయి. స్టేషన్లో తిరుగుతున్న పాముపిల్లలను చూసి సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్స్కు సమాచారం అందించడంతో వారు వచ్చి ఆ పాము పిల్లలను సురక్షితంగా పట్టుకెళ్లారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్టేషన్ ప్రాంగణంలోకి ప్రవేశించిన మూడు నాగుపాము పిల్లలను చూసి ముందుగా సిబ్బంది భయపడినా ఆ తర్వాత అప్రమత్తమయ్యారు. వెంటనే వన్యప్రాణి సంరక్షక బృందానికి సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని ఆ పాము పిల్లలను పట్టుకున్నారు. సమీపంలోని పొదల ఇవి వచ్చి ఉంటాయని పోలీసుల భావిస్తున్నారు. ‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ’ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మూడు నాగుపాము పిల్లలను సురక్షితంగా పట్టుకెళ్లారని చెప్పారు.
పట్టుకున్న పాము పిల్లలను సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టినట్లు పోలీసులు చెప్పారు. సకాలంలో స్పందించి పాములను పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. నగరం వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఇలాంటి మానవ-వన్యప్రాణి సంఘర్షణలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో పాములు, ఇతర జీవులు జనావాసాల్లోకి రావడం సాధారణంగా మారింది.