మకాయ్ (ఆస్ట్రేలియా): భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందన..మహిళల బిగ్‌బాష్ లీగ్(డబ్ల్యూబీబీఎల్)లో సూపర్ సెంచరీతో కదంతొక్కింది. బుధవారం మెల్బోర్న్ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ బ్యాటర్ మందన(64 బంతుల్లో 114 నాటౌట్, 14ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో విజృంభించింది. డబ్ల్యూబీబీఎల్‌లో సెంచరీ కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా మందన రికార్డుల్లోకెక్కింది. మందన ఒంటరి పోరాటం చేసినా సిడ్నీ థండర్స్ జట్టు 4 పరుగుల తేడాతో మెల్బోర్న్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత మెల్బోర్న్ 20 ఓవర్లలో 175/4 స్కోరు చేసింది. హర్మన్‌ప్రీత్‌కౌర్(55 బంతుల్లో 88 పరుగులు, 11ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సిడ్నీ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 171 పరుగులకు పరిమితమైంది. కౌర్ వేసిన ఆఖరి ఓవర్ చివరి బంతికి ఆరు పరుగులు అవసరమైన దశలో మందన విఫలం కావడంతో సిడ్నీ జట్టు ఓటమి వైపు నిలిచింది. విజయం కోసం మందన కడదాకా పోరాడినా లాభం లేకపోయింది. డబ్ల్యూబీబీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ అశ్లే గార్డ్నర్ సరసన స్మృతి నిలిచింది.