కోటపల్లి : ధూమపానంతో అనేక అనర్ధాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరు ధూమపానానికి దూరంగా ఉండాలని చెన్నూర్ జూనియర్ సివిల్ జడ్జి ( Civil Judge ) పర్వతపు రవి ( Parvatap Ravi ) సూచించారు. కోటపల్లి మండలంలోని కొల్లూరు గ్రామంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ధూమపానం ఆరోగ్యానికి మహాశాపమని, ధూమపానం సేవించి అనేక రోగాల పాలై ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయన్నారు. పొగాకు ఉత్పత్తులను వాడకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, ఎంఈవో వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి వెన్నెపురెడ్డి సుధాకర్ రెడ్డి, న్యాయవాది కొప్పుల ప్రభాకర్, మాజీ సర్పంచ్ జంగ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.