హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ ) : ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సోమవారం నుంచి అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే గతనెల 10వ తేదీ నుంచి 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. ఆయా చోట్ల విజయవంతం కావడంతో మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నామని ప్రకటించారు.
వచ్చే నెల చివరినాటికి రాష్ట్రంలోని 144 సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని తెలిపారు. అవసరమున్నచోట అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఆర్వో ఆఫీసు, హైదరాబాద్ ఆర్వో ఆఫీస్ సౌత్, నారపల్లి, ఘటేసర్, మలాజిగిరి, ఉప్ప ల్, కాప్రా, బీబీనగర్, సిద్దిపేట్, సిద్దిపేట్ రూరల్, గజ్వేల్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ ఆర్వో ఆఫీసు, జనగాం, ఘన్పూర్, నర్సంపేటతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు.