శ్రీనగర్: స్థానిక స్లీపర్ సెల్స్ సహకారం లేకుండా పహల్గాం ఉగ్రదాడి జరిగి ఉండదని మాజీ స్లీపర్ సెల్ సభ్యుడు తెలిపాడు. సోమవారం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, దాడి చేయాల్సిన చోట ఎందరు సైనికులు ఉన్నారో ఉగ్రవాదులకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించాడు. ఈ సమాచారాన్ని స్లీపర్ సెల్ ఆపరేటివ్స్ ముందుగా ఉగ్రవాదులకు ఇస్తారని చెప్పాడు. కశ్మీరుకు చెందిన ఈ స్లీపర్ సెల్ మాజీ సభ్యుడు రెండేళ్లు జైలు జీవితం గడిపాడు.