కీవ్:ఉక్రెయిన్లోని వివిధ నగరాలపై రష్యా క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ చేపట్టిన ‘ఆపరేషన్ స్పైడర్వెబ్’కు ప్రతీకారంగా శుక్రవారం రాత్రి ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాలను, నగరాలను రష్యా లక్ష్యంగా చేసుకుంది. రష్యా సేనలు 400కు పైగా డ్రోన్లు, 40కి పైగా క్షిపణులను ప్రయోగించాయని, దాడుల్లో ఆరుగురు మరణించారని, మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. 87 డ్రోన్, 7 మిస్సైల్ దాడుల్ని అడ్డుకున్నామని ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ తెలిపింది. డోనెస్క్, డైప్రోపెట్రోవిస్క్, ఒడెస్సా, టెర్నోపిల్ తదితర నగరాలను రష్యా టార్గెట్ చేసిందని వెల్లడించింది.