Mrunal Thakur | అదృష్టం ఒక్కొక్కరిని ఒక్కోలా వరిస్తుంది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచేసిన సొగసరి.. మృణాల్ ఠాకూర్. అందం, అభినయం కలబోసినట్టున్న ‘సీతారామం’ సీతమ్మ అణుకువలో బాపూ బొమ్మే! దశాబ్దకాలంగా సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్న తనకు.. తెలుగు ప్రేక్షకులు జీవితకాలానికి సరిపడా విజయాన్ని అందించారు. ఆ వాలుకండ్ల వయ్యారి సినిమా ముచ్చట్లు..
మాది ముంబై. ఎంతైనా ఫ్యాషన్ రాజధాని కదా! చిన్నప్పటినుంచే మోడ్రన్‌గా ఉండటం అలవాటైంది. చదువు తర్వాత మోడలింగ్‌లోకి వచ్చాను. తర్వాత వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకున్నాను. సినిమా నాకు చాలా నేర్పింది. ఏ ప్రాజెక్టులో పనిచేసినా తోటినటీనటులలోని మంచిని గ్రహించడం నాకు అలవాటు.
నా మొదటి కన్నడ సీరియల్ ‘కుంకుమ భాగ్య’. అన్ని భాషల్లో డబ్ అయ్యింది. దీంతో నాకు మంచి పేరు వచ్చింది. హిందీ ‘జెర్సీ’ రీమేక్ షూటింగ్లో ఉండగా ‘సీతారామం’ పిలుపు వచ్చింది. హనుగారు కథ చెప్పగానే ఓకే అన్నాను. రాకుమారి నూర్జహాన్ ప్రేమకోసం సీతగా మారడం బాగా నచ్చింది.
నా మొదటి సినిమా ‘లవ్ సోనియా’. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఏదైనా సీరియల్ చేయమని మా అమ్మ సలహా ఇచ్చింది. కానీ నేను ఒప్పుకోలేదు. మంచి సినిమా అవకాశం వస్తుందనే నమ్మకంతో ఉన్నాను. ఇన్నాళ్లకు నా నిరీక్షణ ఫలించింది.
మెల్బోర్న్ ఫిలిం ఫెస్టివల్‌కు ‘మహానటి’ తరఫున నాగ్ అశ్విన్ వచ్చారు. ఆ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేశ్ నటన అద్భుతం. నాకూ అలాంటి అందమైన పాత్ర చేయాలని ఉందని అశ్విన్‌తో అన్నాను. అలా ‘సీతారామం’ ద్వారా వైజయంతీ ఫిలిమ్స్‌లో భాగమయ్యా.
నాకు కథక్ అంటే ఇష్టం. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా. ‘సీతారామం’లో డ్యాన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే సీన్స్‌లో ఆ అనుభవం బాగా వర్కవుట్ అయ్యింది. కెరీర్లో ఇలాంటి పాత్రలు అరుదుగా వస్తాయి. దుల్కర్ సల్మాన్‌తో నటించడం మంచి జ్ఞాపకం. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు ఇంతలా అభిమానించడం ఆనందంగా ఉంది.
తమిళ, మలయాళ సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఈ విషయంలో అశ్వినీదత్, స్వప్న.. ఇద్దరికీ రుణపడి ఉంటాను. తెలుగులో తప్పకుండా మరిన్ని సినిమాలు చేస్తాను. నేను ఛాలెంజింగ్ పాత్రలు కోరుకుంటున్నా. ప్రస్తుతం బాలీవుడ్లో ‘పీపా’ అనే చిత్రం చేస్తున్నా. ఇండియా, బంగ్లాదేశ్ నేపథ్యంగా సాగిపోయే అందమైన కథ ఇది. ఆదిత్యరాయ్ కపూర్‌తో ‘పూజా మేరీ జాన్’ చేశాను. ప్రేమ, పెండ్లి ఆలోచనలు ఇప్పట్లో లేవు. నా ఫోకస్ మొత్తం సినిమాలపైనే.
“Mrunal Thakur | పరువాలు ఒలకబోస్తున్న మృణాల్ ఠాకూర్..”