రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్లలో సీఎం రేవంత్రెడ్డి సభ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అడ్డగోలుగా దుబారా ఖర్చు పెడుతున్నారు. కలెక్టరేట్లో ఇప్పటికే హెలిప్యాడ్ ఉండగా, సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డులో మరో హెలిప్యాడ్ ఉన్నది. అయినప్పటికీ సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆగమేఘాల మీద దాదాపు రూ.10 లక్షలతో మరో హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు.
రేవంత్రెడ్డి హెలికాప్టర్ ద్వారా కళాశాల మైదానంలో ల్యాండ్ అయి.. అక్కడే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి పాదయాత్రగా సభాస్థలికి వెళ్తారని అధికారులు తెలిపారు. రెండు హెలిప్యాడ్లు ఉన్నప్పటికీ లక్షలు ఖర్చుచేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తూ మరోటి ఏర్పాటు చేయడంపై సిరిసిల్ల ప్రజలు మండిపడుతున్నారు.