ఎన్టీపీసీకి సింగరేణి బొగ్గు

- రెండు సంస్థల మధ్య ఒప్పందం
- ఏటా 68.5 లక్షల టన్నులు సరఫరా
- సింగరేణి బొగ్గు నాణ్యతకు ఎన్టీపీసీ ఫిదా
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రామగుండంలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్తు కేంద్రానికి సింగరేణి బొగ్గు సరఫరాచేయనున్నది. ఈ రెండు సంస్థల మధ్య బుధవారం హైదరాబాద్‌లోని సింగరేణిభవన్‌లో ఒప్పందం జరిగిం ది. తెలంగాణ కోసం ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామగుండంలో ఎన్టీపీసీ తొలి విడతగా 1,600 (2×800) మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మిస్తున్నది. దీనికి ఏటా 68.5 లక్షల టన్నుల బొగ్గు అవసరమవుతుంది. ఈ ప్లాంట్‌కు తొలుత కోల్ఇండియా పరిధిలోని మందాకిని బ్లాక్ నుంచి బొగ్గు కేటాయించారు.
అందుబాటులో ఉన్న సింగరేణి నుంచి బొగ్గును తీసుకోవాలని నిర్ణయించుకొన్నామని, దశాబ్దాలగా సింగరేణి నాణ్యమైన బొగ్గను సరఫరా చేస్తుండటమే ఈ నిర్ణయానికి కారణమని తెలంగాణ ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్‌కుమార్ స్పష్టంచేశారు. ప్రస్తుతం నిర్మిస్తున్న 1,600 మెగావాట్ల ప్లాంట్‌కే కాకుండా మొత్తం 4,000 మెగావాట్ల ప్లాంట్లకు కూడా సింగరేణి నుంచే బొగ్గును తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లోని ఎన్టీపీసీ కేంద్రాలకు కూడా తామే బొగ్గు సరఫరా చేయనున్నట్టు సింగరేణి ఈడీ (కోల్మూవ్మెంట్) జే అల్విన్ చెప్పారు.
సింగరేణీ జీఎం (కో-ఆర్డినేషన్, మార్కెటింగ్) సూర్యనారాయణ మాట్లాడుతూ.. రామగుండం 1,600 మెగావాట్ల ప్లాంట్ విద్యుత్తులో 85 శాతం రాష్ట్ర అవసరాలకే ఉపయోగపడుతుందని, స్థానికంగా లభించే సింగరేణి బొగ్గు తీసుకోవడం ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గి తెలంగాణకు చౌకగా విద్యుత్తు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డీజీఎం మారేపల్లి వెంకటేశ్వర్లు, అదనపు మేనేజర్ మహేందర్‌రెడ్డి, చీఫ్ లైజాన్ ఆఫీసర్ మహేశ్, ఎన్టీపీసీ అడిషనల్ జీఎంలు ప్రేమ్‌కుమార్, షిండే, సీనియర్ మేనేజర్ గాలి సుందర్ తదితరులు కూడా పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- coal supply
- NTPC
- Singareni MoU
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

