హైదరాబాద్ మే 15 (నమస్తే తెలంగాణ) : సింగరేణి నుంచి ఎన్ఎస్పీసీఎల్(ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ)కి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సింగరేణి కాలరీస్, ఎన్ఎస్పీసీఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
సింగరేణి సీఎండీ బలరాం ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ ఎస్డీఎం సుభానీ సమక్షంలో సింగరేణి జీఎం(మార్కెటింగ్) ఎన్వీ రాజశేఖర్‌రావు, ఎన్ఎస్పీసీఎల్ సీఈవో దివాకర్ కౌశల్, జీఎంలు నీల్ కమల్, పలాష్‌లు అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. సింగరేణి నాణ్యమైన బొగ్గు సరాఫరా చేస్తుందనే నమ్మకంతోనే ఈ ఒప్పందం చేసుకున్నామని ఎన్ఎస్పీసీఎల్ అధికారులు వెల్లడించారు.