న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 : వెండి పరుగులుపెట్టింది. కిలో వెండి ధర రూ.300 అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1,32,300 పలికింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం వల్లనే ధరలు మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది..
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. పదిగ్రాముల ధర రూ.500 తగ్గి రూ.1,13,300కి దిగొచ్చింది.