‘మంగన్‌లో పెట్టి తిప్పితే అన్నీ సెట్’
ప్రజా సమస్యలను పరిషరించాల్సిన బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి నుంచి వచ్చిన అనుచిత వ్యాఖ్యలు సిద్దిపేట జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బండచర్లపల్లిలోని 767 సర్వే నంబర్లో 11.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
- సిద్దిపేట రూరల్ తహసీల్దార్ అనుచిత వ్యాఖ్యలు
- కలెక్టర్‌కు బాధితుడి ఫిర్యాదు
సిద్దిపేట, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజా సమస్యలను పరిషరించాల్సిన బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి నుంచి వచ్చిన అనుచిత వ్యాఖ్యలు సిద్దిపేట జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బండచర్లపల్లిలోని 767 సర్వే నంబర్లో 11.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో వివరాలు తెలుసుకునేందుకు తహసీల్దార్ గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ భవనంలో గ్రామస్తులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను తొలగిస్తామని వెల్లడించారు.
ఈ క్రమంలో గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్ తన ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని తహసీల్దార్‌ను కోరాడు. దీనికి అనుమతులు లేవని తహసీల్దార్ చెప్పడంతో.. తాము సుడా నుంచి అనుమతి తీసుకున్నామని రంజిత్ వివరించాడు. ఈ క్రమంలో మంగన్‌లో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి.. సుడా గిడా సెట్ అవుతాయి అంటూ తహసీల్దార్ వ్యాఖ్యానించారు. తహసీల్దార్ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన రంజిత్‌కుమార్.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వాట్సాప్ ద్వారా సిద్దిపేట కలెక్టర్‌కు పంపించి ఫిర్యాదు చేశాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

