తెలంగాణ నీళ్లు ఏపీకి ఎట్లిచ్చినవ్ రేవంత్?
తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఆంధ్రాకు ఎట్లిచ్చినవ్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. 73 కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ చేనుకు కృష్ణా నీళ్లియ్యని సీఎం రేవంత్‌రెడ్డి.. 730 కిలో మీటర్ల దూరంలోని ఉన్న ఏపీలోని కుప్పానికి ఎట్లిచ్చినవ్? అని నిలదీశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుగా వచ్చే 200 టీఎంసీల నీళ్లు ఎక్కడ ఒడిసి పట్టినవో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
- 73 కిలోమీటర్లు రాని నీళ్లు.. 730 కిలోమీటర్ల దూరం ఎట్లపోయినయో చెప్పాలి
- దమ్ముంటే యాదాద్రి పవర్‌ప్లాంట్ బంద్ పెట్టి కరెంటివ్వు
- రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సవాల్
యాదగిరిగుట్ట, అక్టోబర్ 29: తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఆంధ్రాకు ఎట్లిచ్చినవ్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. 73 కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ చేనుకు కృష్ణా నీళ్లియ్యని సీఎం రేవంత్‌రెడ్డి.. 730 కిలో మీటర్ల దూరంలోని ఉన్న ఏపీలోని కుప్పానికి ఎట్లిచ్చినవ్? అని నిలదీశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుగా వచ్చే 200 టీఎంసీల నీళ్లు ఎక్కడ ఒడిసి పట్టినవో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో ఇప్పటికీ 57 టీఎంసీల మేర నీళ్లున్నాయని, కేసీఆర్ సర్కార్ సిద్ధం చేసిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటికైనా 32 టీఎంసీల వరకు తెలంగాణ రాష్ర్టానికి నీళ్లు పారించే అవకాశం ఉన్నా ఎందుకు ఎత్తిపోయడంలేదో చెప్పాలని అన్నారు.
పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ఓటరు నమోదు అవగాహనపై గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో నిర్వహించిన సమావేశంలో జగదీశ్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఈ మూడేండ్ల కాలంలో జరిగిన అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఉండేందుకే ఏపీ సీఎం చంద్రబాబుకు కృషా జలాలు నజరానాగా ఇచ్చారని దుయ్యబట్టారు. కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్‌చేసి రోజుకు టీఎంసీ నీటిని విడుదల చేస్తే తెలంగాణలో కరువు కనబడేది కాదుకదా? అని ప్రశ్నించారు. ఒక్కరోజు కేసీఆర్‌కు అధికారం ఇస్తే కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద రేవంత్‌రెడ్డి చేతుల మీదుగానే మోటర్లను ఆన్‌చేసి రాష్ర్టానికి సాగుజలాలు అందిస్తామని సవాల్ చేశారు. పట్టభద్రులు రేవంత్‌రెడ్డి సర్కార్‌ను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కరువును పారదోలేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్టు తెలిపారు. కాళేశ్వరం జలాలు విడుదల చేయకుండా తెలంగాణలో కరువును తెచ్చింది రేవంత్‌రెడ్డి సర్కారేనని ధ్వజమెత్తారు. ఏ ముఖం పెట్టుకుని పట్టభద్రులను ఓట్లడుగుతావో చెప్పాలని డిమాండ్ చేశారు.
యాదాద్రి పవర్ ప్ల్లాంటు బంద్ పెట్టి కరెంటిస్తవా?
2023 డిసెంబర్ నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్ 5,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో ఉన్నదని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కేవలం రూ. 3.80కే యూనిట్ ఉత్పత్తి చేస్తే ఇంత ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే యాదాద్రి పవర్ ప్లాంటును బంద్ పెట్టి రాష్ర్టానికి కరెంటు ఇవ్వాలని సవాల్ విసిరారు. అప్పుడేమో అంత ఖర్చా? అని దొంగమాటలు మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడేమో రూ. 10కు యూనిట్ కరెంటు దొరికే పరిస్థితి లేదని ముఖం చాటేస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికే వ్యవసాయానికి రాత్రి పూట కరెంటు బంద్ పెట్టారని, సాగు, పరిశ్రమలు, ఐటీ రంగాలపై కోతలు విధించారని విమర్శించారు. అప్రకటిత కోతలతో పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బండా నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

