భవిష్యత్తులో డబ్బు దాచుకోవడం వృథా
కృత్రిమ మేధస్సు(ఏఐ), రోబోట్ల అభివృద్ధి వల్ల భవిష్యత్తులో ప్రపంచం అపారమైన సమృద్ధితో నిండిపోతుందని, అందువల్ల సుదూర భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయడం నిరర్థకమని ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు.
- ఏఐతో అపారమైన సంపద
- ఎలాన్‌మస్క్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : కృత్రిమ మేధస్సు(ఏఐ), రోబోట్ల అభివృద్ధి వల్ల భవిష్యత్తులో ప్రపంచం అపారమైన సమృద్ధితో నిండిపోతుందని, అందువల్ల సుదూర భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయడం నిరర్థకమని ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఏఐ సాంకేతికతలో పురోగతి వల్ల వస్తువులు, సేవలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని ఆయన చాలాకాలంగా చెప్తున్నారు. భవిష్యత్తులో సమృద్ధి అపారంగా పెరిగిపోతుందనే ఆశతో ప్రస్తుతం తీసుకుంటున్న కొన్ని ఆర్థికపరమైన తప్పుడు నిర్ణయాలను సమర్థించుకోవచ్చా?
అంటూ ఓ వినియోగదారుడు సరదాగా చేసిన వ్యాఖ్యకు మస్క్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘అత్యంత తెలివైన సాంకేతికతతో అపారమైన సమృద్ధి అందుబాటులోకి రానున్న నేపథ్యంలో సుదూర భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేయడం నిరర్థకం’ అని పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, మనుషుల ఆకారంలో ఉండే రోబోట్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చగలవని ఆయన పలుమార్లు అభిప్రాయపడ్డారు. 2036 నాటికి డబ్బుకు ప్రాధాన్యం లేకుండా పోవచ్చని ఆయన అన్నారు. ఏఐ, రోబోట్లు ప్రజలు వినియోగించగలిగిన దానికంటే ఎక్కువ వస్తువులు, సేవలను ఉత్పత్తి చేయగలవని ఆయన వివరించారు.
మస్క్ ఎందుకు ఇలా భావిస్తున్నారు?
ప్రస్తుతం ప్రజలు ఆహారం, ఇండ్లు, రవాణా, వినోదం వంటి నిత్యావసరాలు, సేవల కోసం ప్రధానంగా డబ్బుపైనే ఆధారపడుతున్నారు. భవిష్యత్తులో ఏఐ, రోబోట్లు ఈ వస్తువులను ప్రజల అవసరాలకు మించి ఉత్పత్తి చేయగలిగితే, వాటి లభ్యత పెరిగి, ఖర్చులు తగ్గవచ్చని మస్క్ భావిస్తున్నారు. అప్పుడు నేటి సమాజంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యం గణనీయంగా తగ్గిపోవచ్చన్నది ఆయన వాదన.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

