గజ్వేల్ రూరల్, మార్చి 31 : రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని, ఎలాంటి నిబంధనలు పెట్టకుండా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గజ్వేల్ మండల వ్యాప్తంగా 25 గ్రామ పంచాయతీల తీర్మానాలను గురువారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు పోస్టు ద్వారా పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు కేంద్రపై ఒత్తిడి తీసుకొచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే గ్రామాల్లోకి బీజేపీ నాయకులకు తిరగనివ్వబోమన్నారు. అభివృద్ధిలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని, అది జీర్ణించుకోలేకనే కేంద్రం కొర్రీలు పెడు తూ ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి గోయల్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణాశ్రీనివాస్, ఎంపీపీ దాసరి అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు చెరుకు చంద్రమోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు, పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మండల ప్రధాన కార్యదర్శి పాల రమేశ్‌గౌడ్, నాయకులు రాజు, నర్సింగరావు, యాదగిరి, అహ్మద్ పాల్గొన్నారు.
నేడు గజ్వేల్‌లో భూ పట్టాల పంపిణీ..
జగదేవ్‌పూర్ మండలంలోని లింగారెడ్డిపల్లి, కొత్తపేట, ఇటిక్యాల గ్రామాలకు చెందిన రైతులకు మంత్రి హరీశ్‌రావు శుక్రవారం గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో భూ పట్టాలు పంపిణీ చేస్తారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 171 మంది రైతులకు 580 ఎకరాలకు సంబంధించిన పట్టా సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ బాలేశంగౌడ్, గుండ రంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పేదింటి ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్
జగదేవ్‌పూర్, మార్చి 31 : పేదింటి ఆడపడుచుల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రూ. లక్ష16 వేల ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న గొప్ప మనసున్న సీఎం కేసీఆర్ అని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సం క్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే ప్రభుత్వంపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వంటేరు సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ బాలేశంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ రంగారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నరేశ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో శ్రీనివాసవర్మ పాల్గొన్నారు.
ఆరోగ్యాన్ని మించిన ధనం లేదు..
జగదేవ్‌పూర్, మార్చి 31 : క్యాన్సర్‌పై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఎల్లాయగూడెం విజ య మెమోరియల్ స్కూల్లో హార్వెస్ట్ట్ మినిస్ట్రీస్ డైరెక్టర్, విజయలక్ష్మి మెమోరియల్ స్కూల్ చైర్మన్ కాలేబు రాయపాటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యాన్ని మించిన ధనం లేదన్నారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంపై కాలేబు రాయపాటిని అభినందించారు. అంతకుముందు ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. రక్త పరీక్షలు, బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రాములు, ఉకనయ్య, నాయకులు లక్ష్మణ్‌రాజ్, విజయ మెమోరియల్ పాఠశాల యాజమాన్యం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.