తొగుట, మార్చి 31 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పీఏసీఎస్ చైర్మన్ కన్నయ్యగారి హరికృష్ణారెడ్డి అన్నారు. గురువారం పీఏసీఎస్ కార్యాలయంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్‌ను కొనం, రా రైస్‌ను మాత్రమే కొంటామనే సాకుతో ధాన్యం కొనుగోలుపై చేతులెత్తసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బేషరతుగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి డైరెక్టర్లు శ్రీధర్, మహిపాల్‌రెడ్డి, ఎల్లయ్య, నారాయణ, అంజమ్మ, నర్వవ్వ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని
‘మహాజన సభ’ తీర్మానం
మద్దూరు(ధూళిమిట్ట), మార్చి 31 : మద్దూరు సొసైటీ క్యాష్‌కౌంటర్ కార్యాలయంలో పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి అధ్యక్షతన రేబర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యాసంగిలో రైతులు పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మహాజన సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అంతకుముందు 2021-2022 ఆర్థిక సంవత్సరంలో సొసైటీ చేసిన ఆదాయ, వ్యయాలపై సమీక్షించారు. అదేవిధంగా వార్షిక నివేదికను ఆమోదించారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, సీఈవో బోయిని శ్రీధర్, డైరెక్టర్లు పాల్గొన్నారు.
కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలి..
కొమురవెల్లి, మార్చి 31 : తెలంగాణలో రైతులు పం డించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ఎంపీటీసీ బచ్చల సాయిమల్లు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మండలంలోని గురువన్నపేటలో ఎంపీటీసీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సింహులు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పరశురాములు, టీఆర్ఎస్ మండల యూత్ నాయకుడు రమేశ్‌గౌడ్, చంద్రకుమార్, వెంకటేశ్వర్‌రెడ్డి, గణేశ్, రమేశ్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం..
హుస్నాబాద్, మార్చి 31 : కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. హుస్నాబాద్ మండల పరిషత్ ప్రత్యేక సమావేశంలో కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సమావేశంలో ఎంపీడీవో అనిత, మార్కె ట్ చైర్మన్ కాసర్ల అశోక్‌బాబు, మండల వ్యవసాయాధికారి నాగరాజు, ఐకేపీ ఏపీఎం అనిత, సర్పంచ్‌లు మధుసూదన్‌రెడ్డి, స్వరూప, భారతి, ఎంపీటీసీ బొమ్మగాని శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యుడు సలీం తదితరులు పాల్గొన్నారు.