హుస్నాబాద్, మార్చి 24: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తలేదని, కార్పొరేట్ దిగ్గజాలైన అంబానీ, ఆదానీ కనుసన్నల్లోనే కేంద్రం పనిచేస్తు న్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ విమర్శించారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్రం రైతులకు అన్యాయం చేయాలని చూస్తోందని, కేంద్ర ప్రభుత్వం తీరును గ్రామస్థాయి నుంచి ఎండగట్టాల్సిన అవసరం ఉందని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం హు స్నాబాద్ మండలం పోతారం(ఎస్)లోని శుభం గార్డెన్స్‌లో నియోజకవర్గంలోని ఏడు మండలాల టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహి ళా నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభు త్వ మెడలు వంచి, యాసంగి వడ్లు కొనిపించేందుకు సీఎం కేసీఆర్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా మరో తెలంగాణ ఉద్యమంలా పోరాటాలకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెల 30వ తేదీ లోపు పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేయాలని సూచించారు. పాత, కొత్త నాయకులు సమన్వయంతో ఉండి గ్రామ స్థాయి నుంచి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు.
రాబోయే రోజుల్లో అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు జరిగే ఉద్యమాలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో హన్మకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీహరి, సిద్దిపేట జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీలు మా నస, మాలోతు లక్ష్మి, కొక్కుల కీర్తీసురేశ్, అనిత, కొత్త వినీత, జడ్పీటీసీలు భూక్య మంగ, నాగరాజు శ్యామల, వంగ రవీందర్, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ దండుగుల రాజ్యలక్ష్మి, మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్‌బాబు, ప్యాక్స్ చైర్మన్లు దేవేందర్‌రావు, తిరుపతిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అనితారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు వంగ వెంకట్రాంరెడ్డి, మహేందర్, సాంబరాజు, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, రైతుబంధు సమితి మం డల కోఆర్డినేటర్లు కొండల్‌రెడ్డి, రాంరెడ్డి, నాయకులు చిట్టి గోపాల్‌రెడ్డి, సుద్దాల చంద్రయ్య, బండి పుష్ప, వెల్ది శోభ, కార్యకర్తలు పాల్గొన్నారు.