గజ్వేల్, మార్చి 24 : పంజాబ్, హర్యానా మాదిరిగా తెలంగాణ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్‌ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి అధ్యక్షత గజ్వేల్ మహతి ఆడిటోరియంలో గురువారం యాసంగి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల అవగాహన సమావేశం నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఎమ్మె ల్సీ, ఎఫ్డీసీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్కీరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి హాజరై కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. పంజాబ్ హర్యానా రాష్ర్టాల్లో రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసిందని, అదేవిధంగా తెలంగాణ ధాన్యాన్ని కొనాల్సిందేనన్నారు. రైతులకు కేంద్రంతో జరుగబోతున్న నష్టా న్ని వివరించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసేవిధంగా గ్రామాల్లో తీర్మానాలు చేయాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం ఆదేశించినట్లు తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెట్టొద్దన్నారని, సీఎం సీఎంపై కేంద్ర పగబట్టిందని, రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం ఓరుస్తలేదన్నారు.
సీఎం కేసీఆర్ దేశ వ్యవసాయాన్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. అందుకే దేశరాజకీయాల్లోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారన్నారు. దేశ రాజకీయాల్లోకి వస్తే తమకు ప్రమాదమని బీజేపీ భావిస్తుందన్నారు. కేంద్రం తెలంగాణ ధాన్యాన్ని కొనకపోతే వడ్లు మొత్తం ఎత్తి ఢిల్లీలో పోసివద్దామన్నారు. మంత్రి హరీశ్‌రావు జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించడంతో పాటు పామాయిల్ పరిశ్రమల ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఉద్యమం కొనసాగించాలని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ కమిటీల చైర్మన్లు మాదాసు అన్నపూర్ణాశ్రీనివాస్, జహంగీర్, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండలాల రైతు బంధు సమితి సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.