సిద్దిపేట, మార్చి 24 : కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని స్వచ్ఛబడిలో బాలవికాస, సీజీఐ సంస్థ ఆధ్వర్యంలో 41 మందికి చిరువ్యాపారాలు చేసుకునేందుకు ఒక్కొక్కరికీ రూ.14 వేల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కొవిడ్ కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.50 వేలు అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆసరా పింఛన్లు అందజేస్తామన్నారు. అనంతరం కుట్టు మిషన్ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బాలవికాస ప్రతినిధి శౌరిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, గుండు భూపేశ్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటను సుందరంగా తీర్చిదిద్దుతాం..
సిద్దిపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని 4వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.40 లక్షలు, 35వ వార్డు దోబీ గల్లీలో రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ము న్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు అభివృద్ధికి అదనంగా రూ.40 లక్షలు మంజూరు చేస్తానని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోచోట రూ.30 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం అందజేత
కొండపాక, మార్చి 24 : గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కారోబార్, బిల్ కలెక్టర్‌ను మల్టీపర్సస్ నుంచి మినహాయిస్తూ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని కారోబార్ల సంఘం గౌరవాధ్యక్షుడు భూపతిరెడ్డి, అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని మం త్రి హరీశ్‌రావు నివాసంలో ఆయనను కారోబార్లు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.
కిష్టాపూర్ ఎంపీటీసీకి మాతృవియోగం
చిన్నకోడూరు, మార్చి 24 : మండల పరిధిలోని కిష్టాపూర్ ఎంపీటీసీ లచ్చయ్య తల్లి ఎల్లవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు గురువారం గ్రామానికి వెళ్లి లచ్చయ్యను పరామర్శించి ఓదార్చారు. మంత్రి వెంట స్థానిక నాయకులు రాధాకృష్ణశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, వైస్ ఎంపీపీ పాపయ్య, ఏఎంసీ చైర్మన్ కాముని శ్రీనివాస్, సర్పంచ్, నాయకులు ఉన్నారు.