హవేళీఘనపూర్, మార్చి 23 : లోక కల్యాణార్థం నిర్వహించిన మహా సహస్ర చండీయాగం బుధవారం ముగిసింది. హవేళీఘనపూర్ మండ లం కూచన్పల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి ఈ యాగం చేయించారు. ఐదు రోజు ల పాటు రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో కొనసాగిన ఈ యాగానికి వేలాది మంది భక్తులు సందర్శించి తన్మయత్వంలో మునిగి తేలారు.
వేద రావికోట పండిత్రావు, శ్రీవాండ్ల సాయిబాబా, శాస్ర్తు వేణు, వైద్య శ్రీనివాస్, పండితులు దిగంబర్, రాఘవేందర్శర్మ, నరహరిశర్మ, పొద్దార్ నరేందర్‌బాబు, పవన్‌శర్మ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ చండీయాగం వేద మంత్రోచ్ఛరణలతో మార్మోగింది. చివరి రోజు మెదక్ జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి యాగం విశిష్టతను తెలిపారు. యాగానికి హాజరైన భక్తులకు అమ్మ దీవెనలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. పూర్ణాహుతి అనంతరం ఎమ్మె ల్సీ శేరి సుభాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ యాగంలో పాల్గొన్న రుత్వికులు, వేద పండితులు, భక్తులు, ప్రముఖులకు శేరి సుభాశ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
చివరి రోజు పాల్గొన్న ప్రముఖులు
యాగంలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర కార్యదర్శ మల్లిక, సంగారెడ్డి జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు నగేశ్, ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ రమేశ్, పరిశ్రమల సంస్థ జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి, కామారెడ్డి డీపీవో ప్రభాకర్, డీఎల్పీవో సాయిబాబా, రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, నార్సింగ్ సర్పంచ్ దేవాగౌడ్, ఉప సర్పంచ్ బయ్యన్న, సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, యామిరెడ్డి, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, శ్రీహరి, రాజేందర్‌రెడ్డి,సాయాగౌడ్, శ్రీనునాయక్, వినోద్, ఎంపీటీసీలు సిద్దిరెడ్డి, శ్రీనివాస్, గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.