హుస్నాబాద్, మార్చి 23 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో నిరుపేద కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నదని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, చిగురుమామిడి మండలాలకు చెందిన 123 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, మహిళా సంఘాలకు రుణాలు తదితర పథకాలు పేదలకు ఎంతో దోహదపడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియో గం చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకట్, వైస్ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీలు మా నస, లక్ష్మి, కీర్తిసురేశ్, వినీత, జడ్పీటీసీలు మంగ, రవీందర్, మార్కెట్ చైర్మన్ అశోక్‌బాబు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
హుస్నాబాద్, మార్చి 23 : పట్టణంలోని పలు ఫంక్షన్ హాళ్లలో జరిగిన వివాహాలకు ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ హాజరయ్యారు. బుధవారం పట్టణంలోని లక్ష్మి గార్డెన్స్‌లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుకర్ సోదరుడి కూతురు మౌనిక వివాహానికి ఎమ్మెల్యే హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా పట్టణంలోని పలు ఫంక్షన్ హాళ్లలో జరిగిన వివాహాలకు ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీ మానస, వైస్ చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎన్సీఎఫ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్‌బాబు, మాజీ ఎం పీపీ వెంకట్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్‌రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.