గజ్వేల్ రూరల్, మార్చి 23 : తెలంగాణపై కేంద్రం అక్కసు వెళ్లగక్కుతున్నదని, రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, వైద్య సేవల మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంజాబ్ తరహాలో రాష్ట్రంలో పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేసి రైతుల పక్షాన ఉం డాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుండడంతో జీర్ణించుకోలేకనే మోదీ సర్కార్ చిన్నచూపు చూస్తున్నదన్నారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఎఫ్సీఐపై ఉన్నదని, దేశ వ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయాలన్నారు.
ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణపై కేంద్రం వివక్షత చూపిస్తుందన్నారు. 201 7లో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే తమకు అందలేదని చెప్పడంతో ఎంతవరకు సమంజసమన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నాయకులు దేవీ రవీందర్, అంజిరెడ్డి, మాదాసు శ్రీను, అర్జున్‌గౌడ్, ఎంపీపీలు అమరావతి, బాలేశం, జడ్పీటీసీలు మల్లేశం, సుదర్శన్‌రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు మధు, కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్, కుమా ర్, మహేశ్, నవాజ్‌మీరా, నాగులు, రమేశ్, స్వామిచారి, ఉమార్ పాల్గొన్నారు.
గజ్వేల్‌లో నేడు సమావేశం
గజ్వేల్ పట్టణంలోని మహతి అడిటోరియంలో గురువారం ఉదయం 10 గంటలకు టీఆర్ఎస్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సమావేశానికి పార్టీ కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తిచేశారు.