చేర్యాల, మార్చి 10 : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మన వంటింటి బడ్జెట్‌ను ప్రభావితం చేస్తున్నది. యుద్ధ జ్వాలల్లో వంట నూనెల ధర పైపైకి వెళ్తున్నది. వారం రోజుల్లోనే లీటరు నూనె ధర 25 నుంచి 30 శాతం పెరిగింది. దీంతో పేద, మధ్య తరగతి ఆందోళన చెందుతుననది. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ నిల్వల కొరత ఏర్పడే ప్రమాదం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టిన్నట్లు తెలుస్తున్నది. రష్యా-ఉక్రెయిన్ యుద్దం కొన్ని రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే.మొదటగా మూడు, నాలుగు రోజులు నిలకడగా ఉన్న వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరిగాయని వినియోగదారులు తెలుపుతున్నారు. హైదరాబాద్ స్టాక్ పాయింట్లతో కొరత ఉందనే ప్రచారం సాగుతున్నది. గడిచిన ఐదు రోజులుగా వంటనూనె సరఫరా తగ్గిందనే సాకుతో ఎమ్మార్పీ కంటే అదనంగా పెంచి విక్రయాలు జరుపుతున్నారు. పలువురు హోల్‌సేల్, రిటెయిల్ కౌంటర్ వ్యాపారుల సైతం ధర పెంచుతున్నారనే ఆరోపణలున్నాయి.
35 టన్నుల అమ్మకాలు
సిద్దిపేటజిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా రోజువారీగా 35 టన్నుల వంటనూనె అమ్మకాలు జరుగుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బార్, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, దాబాలతో పాటు గృహ అవరాలకు వంట నూనెను నిత్యం వినియోగిస్తున్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాల సమయంలో వినియోగం 25నుంచి30శాతం పెరుగుతుందని
వ్యాపారులు తెలుపుతున్నారు. గడిచిన వారం రోజుల్లో లీటరు నూనెల పై 25 నుంచి 30 శాతం ధర పెరగడంతో ప్రజలపై నిత్యం సుమారు రూ.8.75లక్షల అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. ఉక్రెయిన్, రష్యా దేశాల నుంచి 80శాతం మేరకు సన్‌ప్లవర్ దిగుమతి చేసుకుంటుండగా, మలేషియా, అర్జెంటీనా దేశాల నుంచి పామాయిల్ కొనుగోలు చేస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన పదిరోజుల్లోనే వంటనూనె కొరత ఏర్పడిందా? లేదా? సూపర్ స్టాకిస్ట్ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయా? అనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి.
రోజురోజుకూ పెరుగుతున్న ధరలు
సన్‌ప్లవర్ లీటర్ పది రోజుల క్రితం రూ.140 ఉండగా, ప్రస్తుతం రూ.190కి చేరింది. 5 లీటర్ల క్యాన్ రూ.635 నుంచి రూ.75,800, 15లీటర్ల టిన్ రూ.2150 నుంచి 2300, వేరుశనగ లీటర్ ప్యాకెట్ రూ.145 నుంచి రూ.160, రూ.180, 15లీటర్ల డబ్బా రూ.2200, రూ.2450 రెండో రకం లీటర్ ప్యాకెట్ రూ.140 నుంచి రూ.155, రూ.180, రెండు లీటర్ల క్యాన్ రూ.270 నుంచి రూ.350, మూడు లీటర్ల టిన్ రూ.420 నుంచి రూ.520, 15లీటర్ల టిన్ రూ.2100 నుంచి రూ.2400, పామాయిల్ లీటర్లు రూ.122 నుంచి రూ.150, రూ.180 వరకు పెరిగాయి. రైస్బ్రౌండ్ రకం లీటరు ప్యాకెట్ రూ.145 నుంచి 175, రెండు లీటర్లు రూ.295 నుంచి రూ.370, ఐదు లీటర్ల రూ.780 నుంచి రూ.880 వరకు పెరగడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.
ధరల పెంపు సరికాదు
ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభం కాగానే జిల్లా వ్యాప్తంగా వంట నూనెల ధరలను స్టాకిస్టులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు పెంచేశారు. ఇది సరైన పద్ధతి కాదు, ఎక్కడో యుద్ధం జరిగితే, వెంటనే దాని ప్రభావం ఇక్కడ ఉండ దు. కొన్ని నెలల పాటు యుద్ధం అలాగే కొనసాగితే, అక్కడ నుంచి దేశం దిగుమతి చేసుకునే వాటికి ధర లు పెరుగుతాయి. అసలు నెలలకు సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నప్పటికీ, వెం టనే ధరలు పెంచడం అన్యాయం, సం బంధిత శాఖ అధికారులు ధరల పెం పును అరికట్టాలి.
– అందె బీరయ్య, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి, చేర్యాల