వాషింగ్టన్ : అమెరికాలో నెల రోజులుగా కొనసాగుతున్న షట్డౌన్ ప్రభావం తాజాగా దేశంలోని పలు విమానాశ్రయాలపై పడింది. ప్రభుత్వం విధించిన షట్డౌన్ సమయంలో ఎలాంటి జీతం లేకుండా పనిచేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, టీఎస్ఏ సిబ్బంది అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజర్ కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి.
ఒక్క ఆదివారమే 5 వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) వెల్లడించిన వివరాల ప్రకారం న్యూయార్క్ నగరం సహా దేశంలోని అనేక విమానాశ్రయాలలో సిబ్బంది హాజరు బాగా తగ్గిపోయింది. విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.