Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Teachers Shortage |విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వెంటనే విద్యా వాలంటీర్లను నియమించాలని బీఆర్ఎస్వీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కోరం శివరాజ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఊట్కూర్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ( Teachers Shortage ) తో విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నాయని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వెంటనే విద్యా వాలంటీర్లను (Educational Volunteers) నియమించాలని బీఆర్ఎస్వీ(BRSV ) నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కోరం శివరాజ్ రెడ్డి ( Shivaraj Reddy ) డిమాండ్ చేశారు.
సోమవారం ఊట్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, ఉన్న ఉపాధ్యాయులపై అదనపు పనిభారం పడటంతో విద్యాబోధనకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే విద్యా వాలంటీర్లను నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు విష్ణువర్ధన్, అభిలాష్, అభిత్ ఖాన్, ఇంజు, ఇమ్రాన్, మనోహర్, మాజీ ఉపసర్పంచ్ ఇబదూర్ రహిమాన్, తరుణ్, మాజీ వార్డు సభ్యుడు షేక్ సమీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
Rythu Garjana | ఈనెల 11న నిర్మల్లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

