న్యూఢిల్లీ : కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్ వేదికగా జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్ ట్రయల్స్-1లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 25మీటర్ల పిస్టల్ ట్రయల్స్‌లో ఒలింపియన్ ఇషా సత్తాచాటింది. తన గురికి తిరుగులేదని నిరూపిస్తూ ఈ యువ షూటర్ 35 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. పంజాబ్‌కు చెందిన సిమ్రన్ప్రీత్ కౌర్బ్రార్(36), ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనుభాకర్(31) వరుసగా ఒకటి, మూడు స్థానాలు దక్కించుకున్నారు. మరోవైపు పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో మహారాష్ట్ర షూటర్ రుద్రాంక్ష్ పాటిల్, మహిళల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో సిఫ్ట్‌కౌర్ సమ్రా అగ్రస్థానాల్లో నిలిచారు.