Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
Sheikh Hasina | స్వదేశానికి తిరిగి రావడానికి తనకు కొత్త పాస్‌పోర్టు (News Passport) ఇవ్వాలని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh Ex PM) షేక్ హసీనా (Sheikh Hasina) అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె.. స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తున్నది.
Sheikh Hasina : స్వదేశానికి తిరిగి రావడానికి తనకు కొత్త పాస్‌పోర్టు (News Passport) ఇవ్వాలని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh Ex PM) షేక్ హసీనా (Sheikh Hasina) అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె.. స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని ఆమె బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని తన న్యాయవాది ద్వారా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు ఓ లేఖను ఈమెయిల్ చేశారు.
హసీనా పార్టీ ‘అవామీ లీగ్’ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. లండన్‌లోని మ్యాట్రిక్స్ ఛాంబర్స్‌లోని తన న్యాయ ప్రతినిధుల ద్వారా కూడా ఆమె బంగ్లాదేశ్‌కు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. హసీనా సమర్పించిన దరఖాస్తుల ప్రామాణికతను, ఈ విషయంలో చట్టపరమైన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని బంగ్లాదేశ్ హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ చెప్పినట్లు అధికారిక బీఎస్ఎస్ వార్తా సంస్థ తెలిపింది. ఆ పత్రాల కోసం దరఖాస్తు చేసేందుకు హసీనాకు ఏదైనా చట్టపరమైన హక్కు ఉందా..? అనే విషయాన్ని విదేశాంగ, న్యాయశాఖలు పరిశీలిస్తున్నాయని చెప్పారు.
మరోవైపు హసీనా విజ్ఞప్తిని హాస్యాస్పదమైనదిగా విదేశాంగశాఖ సహాయ మంత్రి హుమాయున్ కొబిర్ పేర్కొన్నారు. ఆమెకు మరణశిక్ష పడిందని, ఉగ్రవాదులకు బంగ్లాదేశ్ పాస్‌పోర్టులను జారీచేయదని వ్యాఖ్యానించారు. ఆమె నిజంగా స్వదేశానికి తిరిగి రావాలనుకుంటే అప్పగింత ఒప్పందం కింద తనను బంగ్లాదేశ్‌కు అప్పగించమని భారత్‌ను కోరాలని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

