‘యూవీ క్రియేషన్స్‌లో ఇది నా నాలుగో హిట్. సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ ఇస్తానని చెప్పి హిట్ కొట్టాను. ఇప్పుడు సమ్మర్లో కూడా కచ్ఛితంగా హిట్ ఇచ్చి తీరుతానని ముందే చెప్పాను. అనుకున్నట్టే బ్లాక్‌బస్టర్ ఇచ్చాను. ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకదేవుళ్లకు కృతజ్ఞతలు’ అని శ్వరానంద్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బైకర్’. డా.రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. మాళవిక నాయర్ కథానాయిక. అభిలాష్‌రెడ్డి దర్శకుడు. వంశీ, ప్రమోద్ నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదలైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో శర్వానంద్ మాట్లాడారు. అభిరుచి ఉంటేనే ఇలాంటి సినిమాలు చేయగలమని, అద్భుతమైన కథతో అభిలాష్ ఈ సినిమా తెరకెక్కించారని, ఈ సినిమా కోసం 22 కేజీలు తగ్గానని, వ్యక్తిగతంగా తన జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చిన సినిమా ‘బైకర్ అని, ఈ సినిమాలో నటించినందుకు గర్విస్తున్నానని శర్వానంద్ పేర్కొన్నారు. ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుంచి కళ్లు తిప్పుకోలేకపోయానని, ఈ సినిమాకు తాను అంతగా కనెక్ట్ అయ్యానని డా.రాజశేఖర్ చెప్పారు.